ఉగాది కొత్త జాతకాలు.. ఏపీలో మళ్లీ అతనే ముఖ్యమంత్రి..

0
102

ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. శ్రీప్లవనామ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌ల జాతకాలు చాలా బాగున్నాయన్నారు ఓ ప్రముఖ జ్యోతిష్యుడు మాండ్రు నారాయణ రమణారావు .

ఏపీ రాష్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చేలా ఉందని జ్యోతిష్యుడు జోస్యం చెప్పారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి  చక్రం తిప్పనున్నారని స్వయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీ రాష్ట్రానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు కూడా తొలగుతాయాని జోస్యం చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు..ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా.. 120-150 సీట్లో విజయం సాధించి… ఆయనే సీఎం అవుతారని కుండ బద్దలుకొట్టి చెప్పారు.