Breaking: ఉక్రెయిన్- రష్యా శాంతి చర్చలు విఫలం

Ukraine-Russia peace talks fail

0
96

ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు విఫలం అయినట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య బెలారస్ లో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. అయితే రెండు దేశాల తమతమ డిమాండ్లపై పట్టుపట్టాయి. ఉక్రెయిన్ క్రిమియా నుంచి రష్యా బలగాలు తొలగాలని ఉక్రెయిన్ పట్టుపట్టింది. దీంతో పాటు కాల్పుల విరమణ పాటించాలని, బలగాలను వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. మరోవైపు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసినట్లు సమాచారం.