శుభవార్త: ఏపీలో అందుబాటులోకి రానున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు..

0
108

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు.

పేదప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశ్యంతో.. ఏపీ సర్కార్‌ వైఎస్సార్‌ అర్భన్‌ హెల్త్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక అడుగు  ముందుకేస్తూ ప్రజలకు ఏదైనా ఆరోగ్య పరంగా సమస్యలు వస్తే వెంటనే చూపించుకునేలా ప్రతి 2 కి. మీ ఒక ఆరోగ్యం కేంద్రం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసే యోచనలో ఉన్నారట.

ఈ పనులు శరవేగంగా పూర్తి చేసి మే నెల చివరి నాటికి వైఎస్సార్‌ అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు ప్రజలకు  అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్‌ తన మొదటి లక్షంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల త్వరగా నిర్మించి ప్రజలకు వైద్యసేవలు అందించడమే పనిగా పెట్టుకున్నాడు.