ఉత్తర కొరియా అధ్యక్షుడు అలవాటుని భాగా ఫాలో అవుతున్న యువత దేశంలో మరో సంచలనం

ఉత్తర కొరియా అధ్యక్షుడు అలవాటుని భాగా ఫాలో అవుతున్న యువత దేశంలో మరో సంచలనం

0
93

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆ దేశంలో ఏం చెబితే అదే చట్టం, వారసత్వంగా తన తాత తన తండ్రి దేశాన్ని పాలించారు, ఇప్పుడు కిమ్ పాలిస్తున్నాడు, ఆయన చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో అవే పాటించాలి, దేశానికి కొత్త వారు వచ్చినా ఆ దేశం రూల్స్ పాటించాల్సిందే, అంత కఠిన రూల్స్ ఉంటాయి, అక్కడ కొత్త వారు వచ్చినా ఆ దేశ రూల్స్ పాటించకపోతే జైలు శిక్ష తప్పదు.

అయితే ఉత్తరకొరియాలో యువత దారుణంగా సిగరెట్ కాలుస్తున్నారట, దేశంలో పొగరాయుళ్లు బాగా పెరిగిపోయారు,ఎన్నో విషయాలలో కిమ్ ను అనుకరిస్తూ తెగ సంబరపడిపోతూ ఉంటారు ఇక్కడ జనం.. ఆయన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ అన్నీ ఇక్కడ యూత్ ఫాలో అవుతారు.

ఇప్పుడు ఆయన కాల్చే లా సిగరెట్టు కూడా కాలుస్తున్నారట, దాదాపు సగం మంది యువత పొగరాయుళ్లుగా మారుతున్నారు..ఇక్కడ స్మోగింగ్ చేయవద్దు అని ఎన్ని ప్రచారాలు చేస్తున్నా జస్ట్ విని మళ్లీ సిగరెట్ కాలుస్తున్నారు, ఇక కాలేజీ యువత మరీ హద్దుమీరి కాలుస్తున్నారు.. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉత్తర కొరియాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని అమలు చేసింది.