నారాలోకేష్ ని వల్లభనేని వంశీ ఇంత మాట అనేశాడేంటి

నారాలోకేష్ ని వల్లభనేని వంశీ ఇంత మాట అనేశాడేంటి

0
82

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఈ సమయంలో తనపై చాలా రోజులుగా అసత్య ప్రచారాలు చేశారని అంతా లోకేష్ వెనుక ఉన్న నాయకులు చేశారు అని ఇదంతా బాబుకి లోకేష్ కి తెలిసి జరిగింది అని పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేశారు వంశీ, అయితే పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం ఎమ్మెల్సీకి కూడా ఓ మీడియా ముఖంగా కౌంటర్ ఇచ్చారు.

అయితే తాజాగా నారాలోకేష్ జగన్ పై వల్లభనేని వంశీపై ఓ కామెంట్ చేశారు సోషల్ మీడియా వేదికగా…ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తాను సంతలో గొర్రెల్లా ఎలా కొన్నాడో, జగన్ గారు చెబుతున్నారు వినండి. జగన్ గారి మరో ప్రత్యేకత ఏంటంటే గొర్రెలతోపాటు గొర్రెల డాక్టర్నీ కొన్నారు అని అన్నారు. దీనిపై వెంటనే వంశీ కూడా కౌంటర్ ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా.

( వంశీ కామెంట్ ఇదే )
అసలే కోతి…
ఆపైన కల్లు తాగింది…
వద్దంటే మంగళగిరికి వెళ్లింది …
చిత్తుగా ఓడిపోయింది… మండలి పోయింది…
ఉన్నది కాస్తా ఊడి పోయింది.
ఏం చేయాలో తోచటం లేదు.
అందుకే పిచ్చి కుక్క కరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు…
గొర్రెలకే కాదు, ఇటువంటి పిచ్చి కుక్కలకూ నా దగ్గర అత్యద్భుతమైన వైద్యం వుంది.