చంద్రబాబుకు షాక్ వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

చంద్రబాబుకు షాక్ వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

0
79

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది… 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో టీడీపీ పిల్లర్లు సైతం ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… ఇప్పటికే నలుగురు రాజ్య సభ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే…

ఇక ఇదే క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి… నిన్న తన బందువు సుజనా చౌదరి కారులో ఒంగోళుకు వెళ్లిన వంశీ తిరిగి విజయవాడలో ప్రత్యక్షమయ్యారు… ఆ తర్వాత మూడు గంటలకు చిన్ననాటి మిత్రడు మంత్రి కొడాలి నాని అలాగే మరో మంత్రి పేర్ని నానిలతో కలిస తాడేపల్లిలో జగన్ తో భేటీ అయ్యారు

ఈ భేటీ సుమారు అరగంటపాటు సాగింది… దీంతో అందరు వంశీ త్వరలో వైసీపీలో చేరుతారనే నిర్ణయానికి వచ్చారు… ఇక వంశీ కూడా దీనిపై తాను దీపావళి తర్వాత స్పష్టత ఇస్తానని చెప్పారు…