ఫ్లాష్- గుడివాడ క్యాసినోపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

0
78

ఏపీలో గుడివాడ క్యాసినోపై ఇంకా రగడ కొనసాగుతుంది. తాజాగా గుడివాడ క్యాసినోపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని.. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయన్నారు. కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమని.. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని చెప్పారు. అది క్యాసినో, క్యాబేరోనే కాదన్నారు.

రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగీ చేస్తోందని నిప్పులు చెరిగారు. అమ్మాయిల డ్యాన్సుల్లో అర్ద నగ్న దృశ్యాలు లేవు, అయినా వాటిని వెంటనే ఆపామన్నారు. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని.. మేం విమర్శలు చేస్తే విలవిలాలాడే చంద్రబాబు మాపై మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.