వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి షాక్

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి షాక్

0
93

మళ్లీ భారీగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది, బంగారం ధర ఈ రోజు కూడా పెరిగింది, ఇక బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక వెండి బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి, ఎక్కడా ధరలు తగ్గడం లేదు.

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.430 పైకి కదిలింది. దీంతో ధర రూ.45,370కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ.520 పెరిగింది. దీంతో ఇప్పుడు ధర రూ.49,500కు పెరిగింది.

దీంతో ఇక మరో రెండు రోజుల్లో పది గ్రాములు 50 వేల మార్క్ చేరుతుంది అంటున్నారు వ్యాపారులు, ఇక వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది, కేజీ వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో ధర రూ.48,500కు చేరింది. ఇక బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అని బులియన్ వ్యాపారులు అంటున్నారు.