వంశీ బెస్ట్ ఫ్రెండ్ కూడా టీడీపీకి టాటా…. బైబై

వంశీ బెస్ట్ ఫ్రెండ్ కూడా టీడీపీకి టాటా.... బైబై

0
108

కృష్ణా జిల్లా ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కంచుగా వ్యవహరిస్తూ వస్తుంది… వైఎస్ హాయంలో కూడా టీడీపీ తమ సత్తా చాటింది… అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ కంచుకోట కొట్టుకుపోయింది… పార్టీ తరపున రాష్ట్రస్థాయి ప్రభావం చూపే రాజకీయనేతలు సైతం జగన్ సనామిలో కొట్టుకుపోయి చతికిల పడ్డారు…

16 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయింది… అందులో ఒకటి గన్నవరం సెగ్మెంట్… ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీకి టాటా చెప్పారు… త్వరలో వైసీపీలో చేరుతానని ప్రకటించేశారు వంశీ… దీంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు…

వంశీ త్వరలో వైసీపీ తీర్థం తీసుకుంటే మరికొందరు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచరలో ఉన్నారట… ముఖ్యంగా వంశీ సన్నిహితుడు బోడె ప్రాసాద్ పేరు వినిపిస్తోంది… ఆయన త్వరలో టీడీపీకి గుబై చెప్పాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఈ ఎన్నికల్లో పెనుమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొలుసు పార్థసారధి చేతిలో ఓటమి చెందారు… దీంతో ఆయన టీడీపీకి దూరంగా ఉంటువచ్చారు తాజాగా వంశీ ఏపీసోడ్ బయటకు రావడంతో ఆయన తెరపైకి వచ్చారు… గతంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు బోడె ప్రసాద్ డబ్బుల ఇచ్చారని చెప్పడంతో ఆయన వివరణ ఇచ్చారు…