టీడీపీ ప‌గ్గాలు ఎన్టీఆర్ తీసుకుంటే అదే చేస్తా -వంశీ

టీడీపీ ప‌గ్గాలు ఎన్టీఆర్ తీసుకుంటే అదే చేస్తా -వంశీ

0
104

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కర్త కర్మ క్రియ చంద్రబాబు అనేది నో డౌట్ , అయితే ఆయన తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారు అంటే ఇఫ్పుడు పెద్ద డౌట్, నారాలోకేష్ కు పార్టీని నడిపే సత్తా లేదు అనే విమర్శలు, సొంత పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక వల్లభనేని వంశీనే కాదు పార్టీలో చాలా మంది అదే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. అందుకే నారాలోకేష్ ని పార్టీకి పెద్ద దిక్కుగా చేయాలి అని బాబు తాపత్రయం అని అంటున్నారు.

అయితే వంశీ ఇప్పుడు రేపో మాపో వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒకవేళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకుంటే వంశీ వైసీపీలో ఉంటారు అనే గ్యారెంటీ లేదు అంటున్నారు . తారక్ పార్టీ పగ్గాలు తీసుకుంటే వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన టీడీపీలోకి వస్తారు అని అంటున్నారు. మరి వంశీ అప్పటి రాజకీయాల బట్టీ ఆలోచిద్దాం అని కూడా ఇంటర్వ్యూలలో చెబుతున్నారు, సో ఏదైనా తాత్కాలికమే అని అంటున్నారు అందరూ