తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి వెళ్లిపోయిన వంశీ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నాశనం అవ్వడానిక ఉమా కారణం అని అన్నారు.. ఉమా వల్లే తాను ఇబ్బందిపడ్డాను అని చెప్పకనే చెప్పాడు. అనేక కార్యక్రమాలు పథకాలు తన నియోజకవర్గంలో చేస్తే వాటిని అడ్డుకున్నారు అని, రైతులకు నీరు ఇచ్చే విషయంలో కూడా కొర్రీలు పెట్టారు అని విమర్శించారు.
అయితే దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉమా పై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇరిగేషన్ లో అనేక మోసాలకు ఉమా పాల్పడారు అని ఆరోపణలు చేస్తుంది.. ఈ సమయంలో వాటికి బలం చేకూరేలా వంశీ విమర్శలు చేశారు. అయితే ఎలాగో ఉమా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. దీంతో గన్నవరం నుంచి తానే బరిలో దిగి అక్కడ గెలిచి వంశీకి గట్టి షాక్ ఇస్తాను అని తన సన్నిహితులకు ఉమా తెలియచేశారట. చూడాలి గన్నవరంలో ఉపఎన్నిక వస్తే ఇక్కడ ఉమా వంశీ తలపడతారేమో.