వంశీకి నారాలోకేష్ దిమ్మతిరిగే కౌంటర్

వంశీకి నారాలోకేష్ దిమ్మతిరిగే కౌంటర్

0
91

తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయే నాయకులు చాలా మంది ఉన్నారు.. అయితే తాజాగా వంశీ మాత్రం చిచ్చు రేపి పార్టీ నుంచి వెళ్లారు.. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతూ, లోకేష్ పై పార్టీ నేతలపై, చంద్రబాబు పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.. అయితే ముఖ్యంగా తన క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తూ వార్తలు రాస్తున్నారని ఇవన్నీ లోకేష్ కు సంబంధించిన వారు చేస్తున్నారని, లోకేష్ వెనుక ఉన్న కొన్ని తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్స్ చేస్తున్న కుట్ర అని విమర్శించారు.

వీటితో లోకేష్ తనని ఏమీ చేయలేడు అన్నారు. అయితే తాజాగా దీనిపై నారా లోకేష్ వంశీకి కౌంటర్ ఇచ్చారు.. వంశీ చేసిన ఆరోపణలు సరికాదని హితవుపలికారు. వెబ్సైట్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వంశీ ఆరోపణలను లోకేష్ ఖండించారు. వంశీ చెబుతున్న వెబ్సైట్లతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. అసలు 10 సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ప్రచారం చేస్తే, ఇప్పుడు ఎందుకు వంశీ మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించారు.. నిన్నటి వరకూ మా వైపు ఉండి జగన్ ని తిట్టాడు, ఇప్పుడు అక్కడకు వెళ్లి పొగుడుతున్నాడు అని. వంశీ హ్యాంగోవర్ లో ఉన్నాడని, ఆస్తులు కాపాడుకునేందుకు వంశీ ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు అని విమర్శించారు.