వల్లభనేని వంశీకి షాకిచ్చిన ఏపీ స్పీకర్

వల్లభనేని వంశీకి షాకిచ్చిన ఏపీ స్పీకర్

0
100

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, నారా లోకేష్ పరువుని నడివీధుల్లో పెట్టి బహిరంగంగా విమర్శలు చేశారు వల్లభనేని వంశీ, దీంతో పార్టీ తరపున వంశీపై చర్యలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ.. ఎవరైనా పార్టీ వదిలి వెళితే వెళ్లాలి కాని, ఇలా విమర్శలు చేయడం ఏమిటి అని అంటున్నారు. తాజాగా ఆయన అంశం కూడా ఇఫ్పుడు స్పీకర్ సమాధానంతో చర్చకు వచ్చింది.

వంశీ రాజీనామా చేసి వైసీపీలోకి వస్తే ఒకే, అలా కాకుండా రాజీనామా చేయకుండా వైసీపీలో చేరితే అతను కూడా ఫిరాయింపు చేసినట్లే ,అతనిపై అనర్హత వేటు వేస్తాము అని చెప్పారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఈ ప్రభుత్వంలో అనైతిక రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. ఎవరైనా రాజీనామా చేయకుండా వేరే పార్టీ నుంచి అధికార ఫార్టీలో చేరితే తమకు అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి వారిపై చర్యలు తీసుకుంటాము అన్నారు

దాని ప్రకారం వారు నైతికంగా రాజీనామా చేసి వస్తే ఒకే, లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటాము అన్నారు స్పీకర్.. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వంశీని బహిష్కరిస్తే.. ఆయనకు స్వతంత్రత లభిస్తుందన్నారు. ఫిరాయింపులు చేసినా ప్రోత్సహించినా రాజకీయంగా విలువ ఉండదని, ఆ విలువల కోసం నిలబడి ఉండాలి అని స్పీకర్ తెలియచేశారు.