వంశీకి టీడీపీ కౌంటర్

వంశీకి టీడీపీ కౌంటర్

0
103

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది… తాజాగా మాజీ హోంత్రి చినరాజప్ప మాట్లాడుతూ…. చంద్రబాబు నాయుడును అలాగే లోకేశ్ ను విమర్శించే అర్హత వంశీకి లేదని అన్నారు… గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చోరవతో రాజకీయ అరంగేట్రం చేశారని ఆయన గుర్తు చేశారు…

అలాంటి వంశీ ఇప్పుడు చంద్రబాబు పైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు…. కేవలం హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను కాపాడుకునేందుకు ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్లారని రాజప్ప మండిపడ్డారు…. ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే ఓడిపోతాననే భయంతో ఉన్నారని అన్నారు…

వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు…. కాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వంశీ ఇటీవలే తనను స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పీకర్ కోరారు…. ఆయన కోరిక మేరకు మీకు నచ్చిన సీటులో కూర్చోవాలని స్పీకర్ చెప్పారు…