సడన్ గా చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమైన వంగవీటి రాధా

సడన్ గా చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమైన వంగవీటి రాధా

0
99

మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత రంగవీటి రాధా సండన్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో ప్రత్యక్ష మయ్యారు… తాజాగా అమరావతి జేఏసీ ఆద్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్రకు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు…

దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు… ఇక అరెస్ట్ సమాచారం తెలుసుకున్న రాధా చంద్రబాబుఇంటికి చేరుకున్నారు.. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు…. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు రాధా..

పార్టీ గెలుపుకోసం తన వంతుకృషి చేశారు కానీ టీడీపీ అధికారం కోల్పోయింది.. ఆ తర్వాత రాధా రాజకీయాలకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు… అమరావతిలో ఇప్పటివరకు టీడీపీ నాయకులు ఎన్నో కార్యక్రమాలు చేశారు…

కానీ వాటిలో రాధా పాల్లొన్న దాఖలాలు లేవు… ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు… కానీ ఇంటికి వచ్చినా కూడా చంద్రబాబును కలువలేకపోయారు రాధా