వారివల్ల వైసీపీ ఒక ఎంపీ సీటు కోల్పోయింది…

వారివల్ల వైసీపీ ఒక ఎంపీ సీటు కోల్పోయింది...

0
98

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 టీడీపీ 23 జనసేన పార్టీ 1 స్థానానికి పరిమితం అయింది… అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు వైసీపీ 22 టీడీపీ 3 స్థానాలు గెలుచుకుంది.. పార్లమెంట్ స్థానాల్లో జనసేన తన ప్రభావం చూపలేకపోయింది…

అయితే అధికారాలు నిర్వాహకం వల్ల తాము ఒక ఎంపీ సీటు కోల్పోయామని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డి అన్నారు.. తాజాగా ఆయన మాట్లాడుతూ తనను ఓడించేందుకు అధికారులు కుట్ర పన్నారని అన్నారు…

ప్రస్తుతం డీఆర్వోగా ఉన్న పులి శ్రీనివాసులు ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఆర్వోకు నేరుగా ఫోన్ చేశారని ఆ వాయిస్ రికార్డ్ ఆధారాలతో సహా తనవద్ద ఉందని అన్నారు… అప్పటి కలెక్టర్ శశిధర్ కూడా తనకు వ్యతిరేకంగా పనిచేశారని రామకృష్ణా రెడ్డి ఆరోపించారు… అధికారుల వల్ల గుంటూరు జిల్లాలో ఒక ఎంపీ సీటు కోల్పోయామని అన్నారు…