ఏపీలో కూడా రెండు నెలలుగా ఆర్ధిక వ్యవస్ధ అత్యంత దారుణంగా ఉంది, ప్రభుత్వానికి ఆదాయం లేదు.. కాని ఓ పక్క ఉద్యోగుల జీతాలు, అలాగే వైరస్ కు సంబంధించి వైద్యశాఖకు కేటాయింపులు చేస్తున్నారు. ఈ సమయంలో వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ అందించడంతో పాటు వారికి 1000 రూపాయల నగదు సాయం కూడా అంద చేస్తున్నారు.
లౌక్ డౌన్ విధించడంతో మతపరమైన సంస్థలు అన్నీ మూతపడ్డాయి. పెద్ద ఆలయాలు – ఇతర మతపరమైన ప్రార్థనా సంస్థల్లో రోజువారి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ ఆలయాలు ప్రార్ధనా మందిరాల్లో కార్యక్రమాలు చేస్తున్న వారికి ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది.
వారందరికీ రూ.5 వేలు ఆర్థిక సాయం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అర్చకులు – ఇమామ్ – మౌజమ్స్ – పాస్టర్ లకు ఈ ఆర్థిక సాయం చేయాలనీ నిర్ణయం తీసుకుంది, మే 26 న వారికి నగదు ఇవ్వనున్నారు, వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది సర్కార్.