వారికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా?

వారికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా?

0
38

దేశంలో కరోనా కేసులు దారుణంగా వస్తున్నాయి రోజుకి ఏకంగా నాలుగు లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి, మరణాలు దాదాపు మూడు వేలకు చేరువ అయ్యాయి, అయితే దేశంలో ఓ పక్క వ్యాక్సినేషన్ జరుగుతోంది, తాజాగా ఓ వార్త అయితే వినిపిస్తోంది.

 

కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా అంటే నిపుణులు అవును అంటున్నారు, ఇప్పటికే పలు దేశాల్లో దీనిపై అధ్యయనాలు చేశారు, అయితే ఇక్కడ టీకా ఇస్తున్న సమయంలో ఓసారి కరోనా వచ్చి తగ్గిన వారికి ఓ డోస్ ఇచ్చారు, వారు ఆరోగ్యంగానే ఉన్నారు అని తెలియచేశారు.

 

దీనిపై మనదేశంలోనూ పరిశోధన జరిగి, ఇవే ఫలితాలు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా మంచి శుభవార్త అవుతుంది అంటున్నారు నిపుణులు, అయితే దీనిపై మన దేశంలో కూడా పరిశోధన జరగాల్సి ఉంది..మొదటి డోసుకే వేల రెట్లు యాంటీబాడీలు పెరుగుతాయి అని అంటున్నారు.

అయితే దీనిపై భారత్లో పరిశోధనలు చాలా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.