ముంబైలో దారుణంగా వర్షాలు పడుతున్నాయి, కుంభవృష్టి కురుస్తోంది, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజా రవాణా అస్తవ్యస్థమైంది.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఎందుకు ఇలా ముంబై వర్షం వస్తే మునుగుతుంది అంటే దీనికి కారణం ఉంది.
ఇక్కడ ఎప్పుడో పాత డ్రైనేజీ సిస్టం వాడుతున్నారు, ఓపెన్ స్పేస్ లను ఆక్రమించి ఇల్లు కట్టడమే అందుకు కారణమని చాలా మంది చెబుతున్నారు..ముంబై డ్రైనేజీ సిస్టం దాదాపు 140 సంవత్సరాలు అయింది ఏర్పాటు చేసి, ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం తీర్చిదిద్దినది. ఆరోజుల్లో మొక్కలు పంటలతో పచ్చగా ఉండేది, ఆ వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా పోయేది.మిగిలిన వర్షపునీరు భూమి లోకి ఇంకి పోయేలా రూపొందించారు.
కాని చెరువులు నాలాలు పూడ్చేసి భవనాలు కట్టారు ఆక్రమణలు జరిగాయి, దీంతో నీరు ఇళ్లల్లోకి వచ్చేస్తోంది. అందుకే నీరు అన్నది ఇంకిపోవడం లేదు.. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతూనే ఉన్నాయి.