వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధరలు వెండి పరుగులు

వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధరలు వెండి పరుగులు

0
87

బంగారం ధర స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది, భారీగా పెరుగుదల కనిపించిన బంగారం ధర నేడు మార్కెట్లో కాస్త తగ్గుదల కనిపించింది, ముఖ్యంగా బంగారం ధర ముంబై బులియన్ మార్కెట్లో భారీగా తగ్గుదల నమోదు చేసింది, మరి మన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఎలా ఉంది వెండి ధర ఎలా ఉంది అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.20 తగ్గుదలతో రూ.51,920కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.20 తగ్గింది. దీంతో ధర రూ.47,590కు చేరింది

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,200కు చేరింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి .. కాని పెరిగే అవకాశాలు లేవు అంటున్నారు బులియన్ వ్యాపారులు, షేర్ల మార్కెట్లో లాభాలు వస్తూ ఉండటంతో బంగారం పై పెట్టుబడికి మదుపరులు ఆసక్తి చూపించడం లేదు.