మరో టీడీపీ ఫైర్ బ్రాండ్ కు తీవ్ర అస్వస్థత షాక్ లో చంద్రబాబు

మరో టీడీపీ ఫైర్ బ్రాండ్ కు తీవ్ర అస్వస్థత షాక్ లో చంద్రబాబు

0
94

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు.

ఇప్పటికే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోగా ఆ తర్వాత తిరుపతి మాజీ ఎంపీ శివప్రసాద్ ఊపిరితిత్తుల వ్యాదితో ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే… ఇదే క్రమంలో తాజాగా మరో టీడీపీ నేత నటుడు వేణుమాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది…

కొద్దికాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ను హుటా హుటిన హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు… ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా స్వాస అందిస్తున్నారు… కాగా తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వేణుమాదవ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే