పర్ ఫెక్టుగా రికార్డు చేసారు

పర్ ఫెక్టుగా రికార్డు చేసారు

0
92

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు… ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఆరోపించారు.

తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైందని అన్నారు… మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన పాస్ వర్డ్ వదిలేశారని అన్నారు

అలాగే ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్ మెంటుని మెచ్చుకోవాలని అన్నారు యజమాని ప్రతి లావాదేవీనీ డైరీలో రాసుకున్నారని కంప్యూటర్లో నిక్షిప్తం చేసారని ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచారని ఆరోపించారు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసారని అన్నారు.,..