బాబుపై దారుణమైన పంచ్ వేసిన విజయసాయిరెడ్డి

బాబుపై దారుణమైన పంచ్ వేసిన విజయసాయిరెడ్డి

0
83

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై వైసీపీలో నిత్యం విమర్శలు చేసే నాయకుడు ఎవరు అంటే వెంటనే చెప్పేది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి …తాజాగా ఆయనమళ్లీ బాబు రాజకీయాలపై కామెంట్స్ చేశారు.

అయితే రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడంతోనే చంద్రబాబునాయుడు ఇటీవల రాజధాని పర్యటన చేశారని అన్నారు. అంతేకాదు ఇసుక, ఇంగ్లీష్ మీడియం రికార్డులు అరిగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. ఇ, ఇ, ఉ తరువాత చంద్రబాబు దేని మీద ఎగిరిపడతారో అని సెటైర్లు వేశారు. ఇకపోతే చంద్రబాబు అనుచరుడు పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ ఫైర్ అయ్యారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరునెలలు అయింది ..అయినా ఆ పొలిటికల్ హీట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు పార్టీ తరపున ప్రభుత్వం తరపున జగన్ తిరుగులేకుండా ముందుకు వెళుతున్నారు.. కాని ప్రజల పక్షాన తాము పోరాడతాం అంటూ పవన్ చంద్రబాబు కావాలనే జగన్ పై బుదర చల్లుతున్నారు అని వైసీపీ విమర్శిస్తోంది. వీరికి వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది.