ఈ కష్టాలు పగోడికి కూడా రావొద్దని విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు… . పేమెంటు తనే ఇవ్వాలి అలాగే పచ్చ మీడియా కవరేజి బాధ్యత కూడా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. దానితో పాటు కార్యకర్తలను తనే తరలించాలని అన్నారు.
ప్రజలకు ఇద్దరి అనుబంధం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టి దత్తపుత్రుడిని ముందుకు నెట్టారు. అయితే ఈ లాంగ్ మార్చ్ కాస్త తుస్సుమందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు..
ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదని అన్నారు. కన్న కొడుకులా అందరినీ కంటికి రెప్పలా చూసుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలని అన్నారు….పెద్ద కొడుకునని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు దగా చేసి లక్షల కోట్లు దోచుకెళ్లారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దత్త పుత్రుడినొచ్చానంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారని సూచించారు విజయసాయిరెడ్డి.