బీజేపీ నాయకత్వంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

0
113

మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కాంగ్రెస్ ను కాదనుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక తాజాగా విజయశాంతి మరోసారి అసమ్మతి రాగం వినిపించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

నేడు సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా ఆమె మాట్లాడుతూ..పార్టీ రాష్ట్ర నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచింది.. పార్టీలో మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి.. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి.. ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా.. కానీ లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు.. నాకు ఏమీ అర్ధం కాలేదు.. నా సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలి.. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.