ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనల్లో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పెట్టుబడుల పేరుతో స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఈ పర్యటనలో భోజనాల కోసం నాలుగు రోజులకు ఏకంగా రూ.1.05 కోట్లు ఖర్చుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీగా ఖర్చు పెట్టినందుకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని వేలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారో తేల్చాలని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.