చంద్రబాబుకు భారీ కౌంటర్

చంద్రబాబుకు భారీ కౌంటర్

0
81

అబద్ధాలకూ ఒక హద్దుండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అంధత్వాన్ని పారదోలారట. మళ్లీ పరీక్షలెందుకంటూ ప్రశ్నిస్తున్నాడు.

రికార్డుల్లో దొంగ రాతలు రాసుకుని 200-300 కోట్లు దిగమింగినట్టు ఆయనే బయట పెట్టుకుంటున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. గ్రామ వలంటీర్ల నియామకంపై కడుపుమంట బయట పెట్టుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

నెలకు 200 కోట్లు ఖర్చు పెట్టి వలంటీర్లను నియమించడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం అని గుడ్లురుముతున్నారని ఆరోపించారు.