చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అదిరిపోయే కౌంటర్

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అదిరిపోయే కౌంటర్

0
86

ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తారని వైసీపీ జాతీయప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ నాయకులు గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, పిల్లల దగ్గర చాక్కెట్లు లాక్కుంటున్నారనో అనడం గ్యారంటీ.

స్త్రీ జాతినే అవమానించినోళ్లకి ఇటువంటివో లెక్కా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్ల పదవీ కాలంలో తన పార్టీకి నిధులు సమకూర్చే బడా కాంట్రాక్టర్లకు టీడీపీ పెద్దలు లక్ష కోట్లు దోచి పెట్టారు. ఇంటికో ఉద్యోగమని మోసం చేసి ఎన్నికల ముందు వెయ్యి పెన్షన్ చేతిలో పెట్టారు.

ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ల బకాయిల గురించి ఆందోళన చెందుతున్నారు తప్ప ప్రజల సాధక బాధల గురించి మాట్లాకున్నారని టీడీపీ నేతలు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.