రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు స్వాగతిస్తుంటే ,మరికొందరు విమర్శలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదు అని తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు కాకుండా సీనియర్ నేతలని మాజీ మంత్రులని రంగంలోకి దించుతున్నారు, తాజాగా దీనిపై మాజీ ఆర్దిక మంత్రి యనమల రియాక్ట్ అయ్యారు. వెంటనే దీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించి తూర్పు ప్రజలకు ఆగ్రహం తెప్పించొద్దు యనమల గారూ… మిమ్మల్ని తుని ప్రజలు తరిమేశారన్న అక్కసుతో వైజాగ్ వద్దని రంకెలేయడం న్యాయం కాదు.
అయినా దీనికి మీ అనుమతి అవసరం లేదు. ప్రజల ఆశీస్సులున్నాయి సిఎం జగన్ గారికి. అంటూ సటైర్ ట్వీట్ వదిలారు.. అయితే ఆయన తునిలో గెలవలేదు జగన్ చేసే మంచి పనులని ఆపాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ వైసీపీ సటైర్ వేస్తోంది.