మరోసారి రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి ఈ సారి ఎవరిపైన అంటే

మరోసారి రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి ఈ సారి ఎవరిపైన అంటే

0
101

సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు సిఎంలు కూర్చుని నదీ జలాల వినియోగం, విభజన అంశాలపై మాట్లాడితే ఎల్లో మీడియా విషం కక్కిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.. కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా “సిఎంల అసంతృప్తి” అంటూ క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాయని ఆయన మండిపడ్డారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు మీడియా బానిసలు అంటు విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. ఉమాతో ఇదే సమస్య. ప్రశ్నలోనే జవాబు కూడా వదులుతాడు. పాపం గర్జించానని అనుకుంటాడు. ఆ అరుపు‘మ్యావ్’ అన్నట్టు వినిపిస్తుందని ఎద్దేవా చేశారు.

పోలవరం పవర్ హౌజ్ కు 3455 కోట్లు కోట్ చేసిన ‘మెగా’ ఇప్పుడు 2810 కోట్లకు ఎలా తగ్గిందని అడుగుతాడు. అందులో మీ ఇద్దరి కమిషన్ ఉందని బయట పెట్టుకోవడం బాగా లేదు ఉమా అని అన్నారు విజయసాయి రెడ్డి