విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ వైసీపీలోకి భారీ వలసలు

విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ వైసీపీలోకి భారీ వలసలు

0
102

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీలకు చెందిన చాలామంది రాజకీయ నేతలు వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు…

ఇటీవలే టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరికొందరు వైసీపీ గూటికి చేరారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మార్కండేయులు వైసీపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

అలాగే మాజీ కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీఎల్ పట్నాయక్ కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తాము రాష్ట్రంలో జగన్ చేస్తున్న అభివృద్దిని చూసి వైసీపీలో చేరామని స్పష్టం చేశారు.