టీడీపీకి విజయసాయిరెడ్డి సంచలన వార్నింగ్

టీడీపీకి విజయసాయిరెడ్డి సంచలన వార్నింగ్

0
85

పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతూ తీసేసిన తాహసిల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన డ్రామా వికటించినా, నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పిందని విజయసాయి రెడ్డి విమర్శించారు..

ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారని విజయసాయిరెడ్డి రోపించారు.

గత ఏడాది తన వాళ్లపై ఐటి, ఇడిలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దె దింపుతానని వార్నింగులిచ్చేవారు ఇప్పడు యరపతినేని కేసు సిబిఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టారు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఎదురు దాడి చేస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు..