లోకేశ్ ఆ పత్రాలను భద్రంగా దాయాలట..

లోకేశ్ ఆ పత్రాలను భద్రంగా దాయాలట..

0
73

తెలుగుదేశం పార్టీ నేత లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెళ్లడించిన సంగతి తెలిసిందే… మొత్తం ఆస్తులు 119.42 కోట్లు ఉండగా అప్పులు 26.04 కోట్లు ఉన్నట్లు తెలిపారు… ఆస్తుల్లో నుంచి అప్పులను మినహాయించగా నికర ఆస్తుల విలువు 93.38 కోట్లని తెలిపారు… గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 85 లక్షలు పెరిగాయని తెలిపారు…

ఇక చంద్రబాబు నాయుడు ఆస్తి 3.87 కోట్లు అందులో అప్పులు 5.13 ఉన్నాయని తెలిపారు… భువనేశ్వరి ఆస్తి 53 కోట్లు నుంచి 50 కోట్లకు తగ్గిందని చెప్పారు… లోకేశ్ ఆస్తి 24 కోట్లు కాగా బ్రాహ్మణి ఆస్తి 15 కోట్లా 68 లక్షలు… దేవాన్ష్ ఆస్తి 19.42 లక్షలు ఉన్నాయని తెలిపారు… ఇక ఈ ఆస్తులపై అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు…

లోకేశ్ తండ్రి చంద్రబాబేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించారని తెలిపారు .అయితే చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు… అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ అన్నారు…