లోకేష్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి

లోకేష్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి

0
91

ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారు లోకేష్ బాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి స్పందించారు.. చంద్రబాబునాయుడు ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు కుట్రలకు పడ్డారని ఆరోపించారు లోకేష్..

బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఒక పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు అని మండిపడ్డారు లోకేష్…

ఇక దీనికి విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు…ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ చిట్టి నాయుడు విధ్వసంకర ఐడియా ఇచ్చాడు. టెర్రరిస్టులంతా తుపాకులు, బాంబులను పక్కకు పడేసి నాటు పడవలను ఆయుధాలుగా వాడాలని నిర్ణయించారట. డ్యాం గేట్లకు అడ్డం పెట్టి వరద ముంపును సృష్టించొచ్చని ప్లాన్ వేస్తున్నారట. ఎంతైనా స్టాన్ఫోర్డ్ లో చదివాడు కదా అని రివర్స్ కౌంట్ ఇచ్చారు విజయసాయి రెడ్డి