చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

0
80

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ ఆసర నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ నేతలు కుతంత్రం పడుతున్నారని ఆరోపించారు… ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

చంద్రబాబు నాయుడు మళ్ళీ దళిత రాజకీయం మొదలుపెట్టావా అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు… సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన”‘వైఎస్సార్‌ ఆసర’ నుండి ప్రజల ద్రుష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా అని ప్రశ్నించారు…

అయితే టీడీపీ నేతల కుట్ర విఫలం అయిందని అన్నారు.. వైఎస్సార్‌ ఆసర సఫలం అయిందని అన్నారు… మళ్ళీ వినండి..మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జమ చేశారని అన్నారు…