చంద్రబాబుపై విజయ సాయిరెడ్డి కొత్త పంచులు

చంద్రబాబుపై విజయ సాయిరెడ్డి కొత్త పంచులు

0
89

తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలి పెట్టాక అయన కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్ గా చిత్రీకరించిందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు….

మొన్నటి దాకా ప్రధాని మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసింది. ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారు. దాంతో ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చి పడిందని అన్నారు. రివర్స్ గేర్ వేయక తప్పడం లేదు.

గతంలో వరదలు, తుఫాన్లు వస్తే చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిచేది. కలెక్టర్లపై ఆగ్రహం,సిఎం వచ్చేదాకా కదలని అధికార గణం అంటూ కుల మీడియా ఆయనను ఆకాశానికెత్తేది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. తిట్లు, సస్పెన్షన్లు లేవని విజయ సాయి రెడ్డి అన్నారు.