విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు జగన్ కీలక బాధ్యతలు…

విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు జగన్ కీలక బాధ్యతలు...

0
98

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… వైసీపీలో కీలకంగా ఉన్నఎంపీ విజయసాయిరెడ్డి అలాగే సలహాదారు సజ్జలరామకృష్ణా రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు జగన్ కీలక బాధ్యతలను అప్పజెప్పారు…

ఈమేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు… రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం జిల్లా విజయనగరం, విశాఖ పట్నం జిల్లాలను అప్పగించారు… అలాగే టీటీడీ చైర్మగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు చిత్తూరు జిల్లాలను అప్పగించారు…

అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూల్ జిల్లా అలాగే కడప అనంతపురం, జిల్లా ప్రకాశం జిల్లాలను ఆయన పర్యవేక్షిస్తారు… తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల చూస్తారు… అలాగే పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయి రెడ్డికి అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు…