విశాఖలో జగన్ పర్యటన ఇలా సాగనుంది

విశాఖలో జగన్ పర్యటన ఇలా సాగనుంది

0
140

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు… అక్కడ పలు ప్రారంబోత్సవాలు చేయనున్నారు… విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావచ్చన్న తర్వాత మొదటి సారి జగన్ ఈ ప్రాంతానికి విచ్చేయనున్నారు…

ఆయనకు స్వాగతం పలికేందకు ప్రజలు తరలి వస్తున్నారు… శనివారం మధ్యాహ్నం 2.30 గంలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేని 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ,చేరుకుంటారు అక్కడినుంచి 3.50 గంటలకు కైలాసగిరికి వెళ్తారు..

వీఎంఆర్ డీఏ తలపెట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు జగన్… ఆ తర్వాత 5.30 గంటకలు ఆర్కే బీచ్ కు చేరుకుని విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్ …