ఏపీలో రాజధాని మార్పు అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది.. ఓ వైపు రైతులు కూడా దీనిపై సీఎం జగన్ ని నిన్న కలవడం కూడా జరిగింది. అయితే రాజధాని నిర్మాణం పై సీఎం జగన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు ఇదంతా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు.
అసలు రాజధాని కోసం ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు మాత్రమే అప్పుడు ఖర్చుచేశారు, అయితే విశాఖ రాజధానిగా బెస్ట్ ఫ్లేస్ అక్కడ అన్నీ సదుపాయాలు ఉన్నాయి,ఏపీలో నెంబర్ వన్ సిటీగా ఉంది, అన్నీ సదుపాయాలు ఉన్న ప్రాంతం మనం పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు అని తెలిపారు సీఎం జగన్.
అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఒకవైపు అమరావతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు అభివ్రుద్ది జరపాలా అని ప్రశ్నించారు. ఇక కేంద్రం నుంచి అరకొర నిధులు మాత్రమే వస్తున్నాయి, ఈ సమయంలో విశాఖని రాజధానిగా చేస్తే మనకు ఖర్చు కూడా తగ్గుతుంది అని తెలిపార సీఎం జగన్.