ఈ జిల్లా టీడీపీలో వలసలు ఇంకా ఉన్నాయ్….

ఈ జిల్లా టీడీపీలో వలసలు ఇంకా ఉన్నాయ్....

0
86

పార్టీనుంచి వెళ్లిన వాళ్లు ఎవరైనా సరే రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజీనామా చేయకుండా పార్టీ మారడం ఏంటని ప్రశ్నిచారు… ఏవరైనా సరే పార్టీ మారలనుకున్నారో వారు రాజీనామా చేసి వెళ్లాలని అన్నారు…

ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేషే పై ఆయన మండిపడ్డారు… టీడీపీకి రాజీనామా చేయకుండా ఆయన వైసీపీకి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నంచారు… మరికొందరు టీడీపీని వీడే ఛాన్స్ ఉందని అదికూడా విశాఖ జిల్లానుంచే ఎక్కువగా ఉందని జోస్యం చేప్పారు విష్ణు కుమార్ రాజు..

గంటా శ్రీనివాస రావు పార్టీ మారుతారా లేదా అనేది చెప్పాల్సి ఉందని అన్నారు.. కాగా ఇటీవలే వాసుపల్లి గణేష్ విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…