విశ్లేష‌ణ‌- 2014 నుంచి గెలుపులే – 2020 లో మొద‌టిసారి టీఆర్ఎస్ ఓట‌మి

విశ్లేష‌ణ‌- 2014 నుంచి గెలుపులే - 2020 లో మొద‌టిసారి టీఆర్ఎస్ ఓట‌మి

0
92

దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలం పార్టీ గెలిచింది, అయితే ఇది సాధార‌ణ విజ‌యం కాదు అంటున్నారు అంద‌రూ అధికార పార్టీ ఓట‌మి చెంద‌డంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ అయ్యారు, ఇది వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌భావం చూపిస్తుంది అంటున్నారు.

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో ఇక గులాబీ పార్టీ షాక్ అయింది, క‌మ‌లం పార్టీ గెలుపుకి అనేక కార‌ణాలు ఉన్నాయి..మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో టీఆర్ఎస్ ఓడిపోవడంతో కారు పార్టీ ఎందుకు దీనికి గ‌ల కార‌ణాలు ఏమిటి అని అన్వేషిస్తోంది.

2014 సాధారణ ఎన్నికల త‌ర్వాత అధికారంలోకి వచ్చిన త‌ర్వాత జ‌రిగిన అన్నీ ఉప ఎన్నిక‌ల్లో గెలిచింది టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన స‌మ‌యంలో మెదక్ ఎంపీగా గెలిచారు రాజీనామా చేయ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చింది టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందారు.

వరంగల్ ఎంపీకి ఉప ఎన్నిక జ‌రిగింది ఇక్క‌డ పసునూరి దయాకర్ గెలుపొందారు
2016లో నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి గెలుపొందారు
తర్వాత పాలేరులో ఉపఎన్నిక వచ్చింది తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు
హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు
కాని ఇప్పుడు మాత్రం దుబ్బాక‌లో అప‌జ‌యం ఎదురైంది అంటున్నారు విశ్లేష‌కులు.