ఫాస్టాగ్ అనేది ఎలా చేయించుకోవాలి మొత్తం వివరాలు ఇందులో తెలుసుకోండి

ఫాస్టాగ్ అనేది ఎలా చేయించుకోవాలి మొత్తం వివరాలు ఇందులో తెలుసుకోండి

0
35

జనవరి 1 నుంచి దేశంలో ప్రతీ ఒక్క నాలుగు చక్రాల వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందే… ఈ విధానం దేశంలో పూర్తిగా జనవరి 1 నుంచి అమలు అవుతుంది.. పాత వాహనాలకి ఎలాంటి మినహాయింపు ఉండదు.. ఆ వాహనాలు కూడా కచ్చితంగా ఫాస్టాగ్ చేయించాలి, మరి ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం.

1. ముందు మీరు ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాలి
2. ఆ తర్వాత మీరు ఫాస్టాగ్ యాప్ లో వివరాలు నమోదు చేయాలి
3. ఫాస్టాగ్ అనేది మీ వాహనం ముందు అద్దంపై అతికించాలి
4..ఇది RFID టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.
5. దానికి మీ బ్యాంకు ఖాతా డిజిటల్ వాలెట్ ద్వారా నగదు నేరుగా కట్ అవుతుంది
6. ఇలా మీకు టోల్ దగ్గర నగదు కట్ అయ్యాక మెసేజ్ కూడా వస్తుంది
7. ఈ ఫాస్ట్ ట్యాగ్ ఎక్కడ ఇస్తారు అంటే మీరు బ్యాంకుల్లో తీసుకోవచ్చు, ఆర్టీఏ ఆఫీసుల్లో ఇస్తారు
8..అమెజాన్, పేటీఎం ఆన్ లైన్లో కొనుగోలు చేయవచ్చు.
9…కచ్చితంగా మీరు నగదుని మాత్రం మెయింటైన్ చేయాలి బ్యాంకు ఖాతాలో ఈ వ్యాలెట్ లో
10. ఇక ఫాస్టాగ్ కొనాలి అంటే మీరు రూ. 250 సెక్యూర్టీ డిపాజిట్, రూ. 100 వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజు వర్తిస్తుంది.
11. మీరు ఫాస్టాగ్ తీసుకుంటే ఇది ఐదేళ్లు పనిచేస్తుంది, తర్వాత మళ్లీ రెన్యువల్ అవుతుంది