లగడపాటి సర్వే పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ

లగడపాటి సర్వే పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ

0
118

విజయవాడ యం.పి టికెట్ కోసమే లగడపాటి మహా కూటమికి అనుకూలంగా సర్వే రిపోర్టు ఇచ్చారని లగడపాటి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణా ప్రభుత్వ సలహాదారు మాజీ యం.పి జి.వివేక్ వెంకట స్వామి.కుటుంబ సభ్యులతో కలిసి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వివేక్ వెంకట స్వామి. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో అర్చకులు ఆశీర్వచనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ. లగడపాటి సర్వేలతో తెలంగాణా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూశారని, కానీ తెలంగాణా ప్రజలు మరోసారి టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు.త్వరలో కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఆసాభావం వ్యక్తం చేశారు. ఏదో ఒకసారి నిజమైందని ప్రతి సారి సర్వే నిజం కాదన్నారు. 2009 లో తాను పెద్దపల్లి యం.పిగా పోటీ చేసిన సమయంలో ఓడిపోతానని చెప్పాడని అయితే ఆ ఎన్నికలలో 50 వేల మెజారిటీతో గెలుపొందానని చెప్పారు..