ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది సీట్… విచారణలో భాగంగా ఈరోజు కపడ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించనుంది సిట్ అధికారులు… నేడు అవినాష్ రెడ్డి సిట్ ముందు హజరు అయ్యారు…
ఆయనతో పాటు మరికొంతమంది అనుమానితులను కూడా ప్రశ్నించనుంది సిట్…. కాగా వివేకానందరెడ్డి మర్డర్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకిత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విచారించారు…
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారు ఆయన. వైఎస్ వివేకానందరెడ్డి ఆగస్ట్ 8 1950లో పులివెందులలో జన్మించారు. వైఎస్సార్ కు వివేకా చిన్న తమ్ముడు. ఆయన తిరుపతిలోని ఎస్వీ అగ్రికట్చర్ యూనివర్సిటీలో డ్రిగ్రీ చదివారు. 1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1999,2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాల సౌమ్యునిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాదం నింపుతోంది