టీడీపీలో వార్

టీడీపీలో వార్

0
78

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేశారు. జగన్ సీఎం అవడానికి కారణం ఆయనే అంటూ ఏబీ వెంకటేశ్వరరావుని ఉద్దేశించి కేశినేని నాని ట్వీట్ చేశారు. టీడీపీ ఓటమిలో ప్రధాన భూమిక పోషించారంటూ ఏ బీ వెంకటేశ్వరరావు పై తీవ్ర విమర్శలు చేశారు కేశినేని నాని.

ఆయన చేసిన ట్వీట్…

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సన్మానిస్తారనుకున్నానని, కానీ సస్పెండ్ చేశారేంటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. మీరు @ysjagan ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ @YSRCParty అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ @JaiTDP ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ అని వ్యాఖ్యానించారు.

నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నాని చేసిన ట్వీట్ కు ఏబీవీ కౌంటర్ ఇచ్చారు.. మీరు మీరు పార్లమెంటులో కలిసే మెలిసే ఉంటారుగా. అందరూ కలసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనాచేస్తానో నాక్కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అని ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు.