పంజాబ్ లో నిన్న ప్రధాని మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్న సంఘటన దేశమంతా కలకలం రేపింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోయింది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది.
తాజాగా నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నరేంద్ర మోదీని చంపుతామంటూ సంకేతాలు ఇచ్చిన ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్. ఇందిరా గాంధీకి పట్టిన గతే నరేంద్ర మోడీకి పడుతుందంటూ వార్నింగ్ఇవ్వడం సంచలనంగా మారింది. నిన్న పంజాబ్‌లో జరిగిన ఘటన తమ మొదటి అడుగు అంటూ పేర్కొంది టెర్రర్ గ్రూప్.
ఇలా చేయడంద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగానే ఈ కుట్ర వెనక ఆల్‌ఖైదా హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. నిరసన తెలిపినవారిలో.. ఉగ్రవాద సంస్థలకు చెందినవారెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు