కోతులు చేసే అల్లరి మాములుగా ఉండదు.. దానికి ఏదైనా రంగు వస్తువు కనిపిస్తే అక్కడ ఎవరు ఉన్నా పట్టించుకోదు.. అది తినే వస్తువు అని వెంటనే దానిని తీసుకుంటుంది, ఎవరైనా దాడి చేయాలి అనిచూస్తే అదే కరిచేస్తుంది.. అందుకే కోతుల జోలికి ఎవరు వెళ్లరు, అంతేకాదు కోతులు ఒక్కోసారి విలువైన వస్తువులు తీసుకువెళ్లిన ఘటనలు చాలా చూశాం, బంగారం నగదు ఇలా తీసుకుపోయి ఆ సంచిలో తినేవి లేవు అని పారేసిన వీడియోలు చూశాం.
ఇప్పుడు అంతే, ఓ పెద్దాయన చేతి నుంచి కోతి సంచి తీసుకుంది.. అందులో దాదాపు నాలుగు లక్షల నగదు ఉంది, ఆ నగదు అంతా రోడ్డుపై వెదచల్లింది, చివరకు 12 వేల రూపాయల నోట్లు కూడా చించేసింది…ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిందీ ఘటన. ఓ వృద్ధుడు రూ. 4 లక్షల నగదు ఉన్న సంచితో బయటకు వచ్చాడు. అతడి చేతిలోని సంచిని చూసి ఆహార పదార్థాలు ఉన్నాయని భావించిన ఓ కోతి ఆ సంచిని లాక్కుని సమీపంలోనే ఉన్న చెట్టెక్కింది.
నోట్లు అన్నీ కింద పాడేసింది, కొందరు పాపం ఆ పెద్దాయనకు ఆ నగదు తెచ్చి ఇచ్చారు.. మరికొందరు జేబులో వేసుకున్నారు..
చివరకు కోతి ఆ సంచి అక్కడ పారేసింది.. దాదాపు 50 వేల వరకూ నగదు మిస్ అయ్యాయని అంటున్నాడు పెద్దాయన.