ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి ఈ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది.. కార్మికులు ఆఫీసర్లు ఎవరికి అయినా సరే ఈ అకౌంట్ ఉంటుంది, ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఈ పీఎఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.. అవసరం అయితే మధ్యలో కూడా కొంచెం తీసుకోవచ్చు.
ఉద్యోగికి వచ్చే వేతనంలో 12 శాతం పీఎఫ్ కింద జమ చేయాలి కంపెనీలు…. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏడాదికి రూ.7.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు ఈ పీఎఫ్ జమ… ఇక మరో విషయం ఏమిటి అంటే, అసలు కంపెనీలకి ఎంత మంది ఉద్యోగులు ఉంటే ఈ పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం.
20 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలకు ఇలా పీఎఫ్ అకౌంట్ లు ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే కంపెనీలో రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందే వారికి కచ్చితంగా పీఎఫ్ సదుపాయం కల్పించాలి. ఇక ఉద్యోగుల వేతనంలో 12 శాతం పీఎఫ్ కింద జమ చేయాలి. ఉద్యోగుల వేతనంలో నుంచి 12 శాతం, అంతే మొత్తంలో యాజమాన్యం వాటా ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తాయి నగదు.. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే మీరు నగదు కావాలి అని భావిస్తే అడ్వాన్స్ విత్డ్రాయల్ తీసుకోవచ్చు ఉద్యోగులు.