మళ్లీ మీడియా ముందుకు సీఎం కేసీఆర్..ఇవాళ ఏం చెప్పబోతున్నారు?

What is the CM KCR going to say to the media again?

0
97

తెలంగాణలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఈనెల 18న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహాధర్నా జరిగిన అనంతరం కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మధ్య కేంద్రం, రాష్ట్రం మధ్య వరి కిరికిరి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈమధ్య వరుస ప్రెస్ మీట్ లు పెడుతూ కేంద్రాన్ని, రాష్ట్ర బీజేపీ నాయకులను ఉతికారేస్తున్నారు. తాజాగా నేడు సాయంత్రం 7 గంటలకు మరోసారి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం ఈ అంశాల నేపథ్యంలో కేసీఆర్ ప్రెస్ మీట్ చాలా  ఆసక్తికరంగా మారింది.