తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పేదలకు ఇప్పటికే కేంద్రం సాయం అందిస్తోంది, అలాగే రేషన్ కూడా అందిస్తోంది, తాజాగా వైట్ రేషన్ కార్డ్ దారులకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది, వారికి నవంబర్ నెల వరకూ రేషన్ ఉచితంగా అందిస్తాము అని తెలిపింది.
దాదాపు 80 కోట్ల మందికి సాయం అందుతుంది అని తెలిపారు, అంతేకాదు దీని కోసం కేంద్రం ఏకంగా 90 వేల కోట్లు ఖర్చు చేయనుంది అని ప్రధాని మోదీ తెలిపారు, అంతేకాకుండా ఈ వైరస్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు.
ఇక తెల్ల రేషన్ కార్డు దారులు వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా లబ్ది పొందుతారు అని తెలిపారు, అలాగే వారికి ఐదు కిలోల బియ్యం కిలో శనగలు ఇవ్వనున్నట్లు తెలిపారు, దేశంలో అన్నీ రాష్ట్రాలు కూడా ఈ సదుపాయం ఇస్తాయి కేంద్రం ద్వారా.